తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెదేపా అధ్యక్షుల పిలుపు మేరకు పార్టీ నాయకులు వేడుకలకు దూరంగా ఉండగా... నియోజకవర్గంలోని వైకాాాపాకు చెందిన ప్రముఖ నాయకుడు ఇటీవల మరణించడంతో ఆ పార్టీ వేడుకలకు దూరంగా ఉంది.
యానాంలో పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు, డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా సిబ్బందితో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ దంపతులను వేద పండితులు మంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు, పారిశ్రామికవేత్తలు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మల్లాడి కృష్ణారావు తనను కలిసేందుకు వచ్చేవాళ్లు పుష్పగుచ్చాలు, శాలువాలు తేవద్దని.. ఆ డబ్బులను వృద్ధాశ్రమానికి విరాళాలు ఇవ్వాలని కోరడంతో అభిమానులు, అధికారులు తమ వంతుగా విరాళాలు డీడీల రూపంలో అందజేశారు.