తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామంలో వేపచెట్టు నుంచి పాలు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తును చూడటానికి తరలివస్తున్నారు. గ్రామస్తులు చెట్టు వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేపచెట్టు నుంచి పాలు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన ప్రజలు తెలిపారు. వేపచెట్టుకు పాలు వస్తున్నాయంటే అక్కడ దేవత నిలిచిందనీ, గుడి లేదా పందిరి నిర్మించాలని దుర్గాదేవి చెప్పిందని భక్తులు వివరించారు. వీర బ్రహ్మంగారు చెప్పిన మాట నిజమైందంటూ గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి : గణేశుడికి ఓ బాధ ఉంది... దానికి ఓ లెక్కుంది...!