నరేంద్రపురంలో చోరీ.. వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం - నరేంద్రపురంలో ఓ ఇంట్లో చోరీ
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురంలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, వెండి, నగదును దుండగులు దోచుకెళ్లారు. 22 కాసుల బంగారు అభరణాలు, మూడు కిలోల వెండి వస్తువులు, ఎనభై వేల రూపాయలు నగదు దోపిడికి గురైందని యజమానులు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాకినాడ నుంచి క్లూస్ టీం వచ్చి వేలి ముద్రలు తీసుకున్నట్టు చెప్పారు.