పసుపురంగు జెండా చూస్తే జగన్‌రెడ్డికి భయమని, తెదేపా అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబడితే వారి దగ్గరికి వెళ్లి ఎన్ని పట్టాలు కావాలి? ఎంత సొమ్ము కావాలి? అంటూ వారు తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు, పిఠాపురంలో ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో ప్రచారం చేశారు. ‘ఇంటి వద్దకే సన్నబియ్యం సరఫరా అంటూ 10 వేల వాహనాలు కొనుగోలు చేసి రూ.1000 కోట్లు వృథా చేశారు. వీటి నిర్వహణకు ఏడాదికి రూ.250 కోట్లు భారం పడుతోంది. రూ.100 ఇచ్చి ప్రజల నుంచి రూ.1000 లాగుతున్నారు. ఇడుపులపాయ పంచాయతీ త్వరలో తూర్పుగోదావరి రాబోతుంది. ఆపేస్తాం.. చంపేస్తాం.. తరిమేస్తాం.. అంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. ఇది బిహార్ కాదు... ప్రజలు తరిమికొడతారని’ పేర్కొన్నారు. తెదేపా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే వర్మ, తెదేపా ఛైర్‌పర్సన్ అభ్యర్థి మాదేపల్లి నాగినీచంద్ర, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మాదేపల్లి వినీల్‌వర్మ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అమరావతిని కాపాడుకునే బాధ్యత మీకు లేదా?: చంద్రబాబు