కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి తలనీలాలు ఇవ్వడాన్ని బహిష్కరించారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నాయీబ్రాహ్మణులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం వెంకటేశ్వర స్వామి దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇచ్చారు. సాధారణ భక్తులకు కూడా దర్శనానికి అవకాశం ఇవ్వడం వివిధ ప్రాంతాల నుంచి 240 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక దర్శనానికి 135 మంది, ఉచిత దర్శనానికి 105 మంది వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
ఇవీ చూడండి..