పౌరుసత్వ బిల్లుకు నిరసనగా ర్యాలీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ నినాదాలు చేశారు. ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనపర్తి గాంధీబొమ్మ నుంచి దేవీచౌక్ చేరుకొని మానవహారం నిర్వహించారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహసీల్దారు వేదవల్లికి వినతి పత్రం అందజేశారు. ఎన్ఆర్సీ, క్యాబ్ బిల్లులను ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ముస్లిం నాయకులు హెచ్చరించారు.ఇదీ చదవండి: 'కాతేరు'ను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాలి