తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో వ్యవసాయ సాగు విస్తీర్ణం రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు, పంటకు గిట్టుబాటు ధర లభించక...ఆక్వా సాగు వైపు రైతన్నలు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. రవాణాకు అవసరమైన విశాల రోడ్లు, వ్యవసాయ భూమి తక్కువ ధరకే లీజుకు లభించటం వంటివి ఆక్వా రైతులకు కలిసొచ్చే అంశాలుగా మారాయి.
పెరిగిన సాగు విస్తీర్ణం...
నియోజకవర్గంలో ఒకప్పుడు సుమారు 5నుంచి 10వేల ఎకరాల వరకూ ఆక్వా సాగు చేయగా... ప్రస్తుతం 70వేల ఎకరాల వరకూ సాగు విస్తీర్ణం పెరిగింది. పచ్చని పంట పొలాలు, నిరంతరం ఫల సాయం అందించే కొబ్బరి తోటలు సైతం ఆక్వా తోటలుగా మారిపోతున్నాయి. ఆక్వాను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని రైతులు కోరుతుంటే... ఆక్వా చెరువుల ప్రభావంతో గ్రామాల్లో తాగు నీటికి తీవ్ర ఆటంకం కలుగుతోందని మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-తిండి పెట్టిన గుడికి.. 4 లక్షలు విరాళమిచ్చిన బిచ్చగాడు!