
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇటీవల కాలంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు రహదారులపై విపరీతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారని అన్నారు. దీని వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, పోలీసులను చూసి భయబ్రాంతులకు గురవుతున్నారని ముద్రగడ వివరించారు. కేసుల భయంతో యువత వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఈ విధంగా కేసులు రాసే బదులు 60 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్లకుండా వాహనాలను డిజైన్ చేయమని సంస్థలను ఆదేశించాలని ముద్రగడ సూచించారు. తనిఖీల వల్ల ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: