ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసరవస్తువులు ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరల పెరగుదలకు గత ప్రభుత్వాలు కారణం అనడం భావ్యం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలపై రోడ్డు పైకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని ముద్రగడ అన్నారు.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ