తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో తహసీల్దార్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆత్రేయపురం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీనివాస్ వర్మ తెలిపారు. శనివారం తహసీల్దార్ నుంచి నమూనాలు సేకరించి.. పరీక్షించగా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తహసీల్దార్ కార్యాలయం, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయన క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం వల్ల కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
ఇదీ చూడండి..