తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ వర్గీయులు(MP Margani Bharat followers) సమావేశమై.. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(MLA Jakkampudi Raja)పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ, ఎస్సీ ఓట్లు లేకపోతే రాజా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరని.. అలాంటిది ఎంపీ భరత్పై సామాజికమాద్యమాల్లో ఘోరంగా పోస్ట్లు పెడుతున్నారని అన్నారు.
రౌడీలు, బ్లేడ్ బ్యాచ్లు, భూ కబ్జాదారులు ఎవరి వద్ద ఉన్నారో రాజమహేంద్రవరం ప్రజలకు తెలుసని అన్నారు. రాజానగరం నియోజకవర్గంలో కొండలు, గుట్టలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎంపీ భరత్తో పెట్టుకోవద్దని హెచ్చరించారు.
ఇదీ చదవండి: MP Bharat : చీకటి రాజకీయాలు ఎవరివో అందరికీ తెలుసు: ఎంపీ భరత్