గోదావరి నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మూడు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల నదీ పరివాహక ప్రాంతాలు మరోసారి ముంపునకు గురవుతున్నాయి.
2 వారాల క్రితం వరద వల్ల చేరిన చెత్త... బురదను పూర్తిగా తొలగించకముందే మళ్లీ నీరు రావటంతో లంక గ్రామాల్లోని ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం యానాం రాజీవ్ బీచ్‌లోని చెత్త, ఇసుక మేటలను కూలీలతో తొలగించే పనులు చేపట్టారు మున్సిపల్ అధికారులు.
ఇదీ చదవండి
రైతులు ఒక్క రూపాయి చెల్లించినా.. రాజీనామా చేస్తా: మంత్రి బాలినేని