రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇవ్వనున్న ఇళ్లకు ప్రయోగాత్మకంగా అత్యాధునిక ఇన్ఫిల్ సాంకేతికతను వినియోగించనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ తెలిపారు. మోడల్ గ్రీన్ హౌస్ పేరుతో నిర్మించే ఈ నమూనా గృహాలకు శుక్రవారం రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని జేగురుపాడులో శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. సోలార్ రూఫింగ్, వెర్టికల్ గార్డెనింగ్, కాలుష్య రహిత పరిసరాలతో సర్వాంగసుందరంగా ఉండే ఒక్కో ఇంటిని 48 గంటల్లో నిర్మించవచ్చని గురువారం ఇక్కడ వివరించారు. రాష్ట్రంలో 30లక్షల ఇళ్ల నిర్మాణాలు అతి తక్కువ సమయంలో చేపట్టనున్నట్లు తెలిపారు. గత లోక్‌సభ సమావేశాల్లో పేదలకు మోడల్ గ్రీన్‌హౌస్ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరాన్ని తాను ప్రస్తావించినట్లు ఎంపీ గుర్తుచేశారు.
ఇవీ చదవండిూపతి జలాశయం నుంచి నీటి విడుదల