ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనలో ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరు ప్రభుత్వ సూచనలు పాటించక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య. ఇది గమనించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు... రక్తసేకరణపై దృష్టి సారించారు.
రెడ్‌క్రాస్ సొసైటీని సంప్రదించి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పిలుపు మేరకు 200 మంది యువకులు రక్తదానం చేశారు. కరోనా కష్ట కాలంలో రక్తం అవసరమైన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: