ETV Bharat / state

కిర్లంపూడిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

పేదవాని సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి పరిధిలోని గ్రామాల్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

mla jyotula chanti babu
కిర్లంపూడిలో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
author img

By

Published : Jan 20, 2021, 1:43 PM IST

సీఎం జగన్ పేదలకు సొంత ఇంటిని అందించి.. వారి కలను నేరవేర్చారని గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండల పరిధిలోగల కృష్ణవరం, రాజుపాలెం, రామకృష్ణాపురం, గెద్దనాపల్లి గ్రామాలకు చెందిన 687మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. నియోజకవర్గంలో ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యనారాయణ రాజు, ఎంపీడీవో లలిత, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వచ్చేనెలలో మరో 2 జిల్లాల్లో అమూల్‌ ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.