తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు దంపతులు సాయిబాబా ఆలయానికి శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణలో తొలగించిన ఆలయం స్థానంలో నూతనంగా నిర్మాణం చేపట్టారు. గోకవరం రోడ్డు విస్తరణ పనుల్లో సాయిబాబా ఆలయం తొలగించటంతో.. ఆలయం పునర్నిర్మాణం చేపడతామని భక్తులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి.. 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఆలయాన్ని నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: అయినవిల్లి సిద్ధి వినాయకుని దర్శనం పునః ప్రారంభం