ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన బియ్యం కార్డులో తూర్పుగోదావరి జిల్లా నాగుల్లంకకు చెందిన ఓ కుటుంబ వివరాలు తప్పుగా నమోదయ్యాయి. తల్లీ, ఇద్దరు కుమారుల పుట్టిన తేదీలు ఒకే విధంగా ప్రచురితమయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన కుటుంబ యజమాని.. ఈ కార్డులోని వివరాలు తమను విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తప్పుల తడకగా ఉన్న ఈ కార్డును సరిచేయాలని ఆయన కోరుతున్నారు.