తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరమని మంత్రి తానేటి వనిత విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని ప్రతిపక్షాలు వక్రీకరించడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటివి జరిగితే చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవారని....ఇప్పుడు దిశ చట్టం వలన ప్రతీ ఒక్కరూ తమకు జరిగిన అన్యాయంపై ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి