గోదావరి పడవ బోల్తా ఘటనలో సురక్షితంగా బయటపడిన బాధితులను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పడవ ఘటన చాలా దురదృష్టకరమన్న ఆయన, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుల వివరాల తెలుసుకునేందుకు కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి :