తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న పడవ ప్రమాద క్షతగాత్రులను మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 8 మృదేహాలు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నాయనీ, మరో నాలుగు మృతదేహాలు వెలికితీసినట్లు వెల్లడించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి సంబంధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి : "గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయ చర్యలు ముమ్మరం"