కొవిడ్ తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్ అన్నారు. పరీక్షలు నిర్వహించకపోతే చాలా ఇబ్బంది అని మంత్రి అభిప్రాయపడ్డారు. పరీక్షలు నిర్వహించవద్దని తల్లిదండ్రులు కోరుకోవడం లేదని అన్నారు. పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ సరికాదని మంత్రి వ్యాఖ్యానించారు. 11 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తో కూడిన అంశమని, కొవిడ్ తగ్గాక నిర్ణయిస్తామని చెప్పారు. ఆర్జేడీ పోస్టుల రద్దు అంశం వదంతులు మాత్రమే అని మంత్రి చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం మోరంపూడిలో ఎంపీ భరత్ రామ్ తో కలిసి మంత్రి సురేశ్ మొక్కలు నాటారు. ఇంటర్లో కొత్త కళాశాలల అవసరాన్ని బట్టి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
ఇదీ చదవండి: నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు