ETV Bharat / state

వేసవి విడిదికి వచ్చింది... దారి తప్పింది!

గోదావరి నదీతీరం.. ఎన్నో అందాలకు నిలయం. పచ్చని చెట్లు.. ప్రకృతి ఒడిలో సేదతీరే పక్షులకు ఆనందాల హరివిల్లు. ఈ అందాలన్నింటినీ చూస్తూ.. తమ సంతతని పెంచుకోవడానికి వేసవి విడిదిగా పక్షులు.. వలస వస్తుంటాయి. అలా వచ్చిన పక్షుల గుంపులో నుంచి ఓ పక్షి తప్పిపోయింది. మన వాళ్లు మాత్రం దానికి సపర్యలు చేస్తూ మురిసిపోతున్నారు.

Migratory bird missing in their group and fall in to a grantu fish pond in east godavri

author img

By

Published : May 4, 2020, 6:02 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలన్నీ.. మడ అడవులతో విస్తరించి ఉండడంతో... విదేశాలకు చెందిన అనేక రకాల పక్షి జాతులు వలస వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాళ్ళరేవు మండలం కోరంగిలోని అభయారణ్యానికి... వేసవి విడిదిగా.. పలు రకాల విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. అలా ఈసారి కూడా వలస వచ్చిన పక్షుల గుంపులో నుంచి ఓ పక్షి దారి తప్పింది.

బాతు కాళ్లు, కొంగ ముక్కు కలగలిసిన ఈ పక్షి... తాళ్ళరేవు మండలం గ్రాంటు గ్రామంలోని రాయుడు రాంబాబు చేపల చెరువులో.. తెల్లవారుజామున పడి ఉంది. దీన్ని గమనించిన వారు.. ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​లో ప్రకృతి సోయగాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.