'గిరిజనుల హక్కుల రక్షణకై పోరాటం' పేరిట తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల గిరిజనులు సమావేశమయ్యారు. ప్రత్తిపాడులో నిర్వహించిన ఈ సమావేశానికి తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా హాజరయ్యారు. నియోజకవర్గంలోని పెద్ద మల్లాపురం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసి, 56 గిరిజన గ్రామాలను ఐటీడీఏ పరిధిలో చేర్చాలన్నారు.
ఇటీవల ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయాలని అధికారులకు సూచించిందని... ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి గ్రామసభలు నిర్వహించకుండా... తీర్మానాలు చేసి అధికారులకు పంపారని వారు ఆరోపించారు. తప్పుడు తీర్మానాలు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తీర్మానాలు చేయించారని ఆరోపిస్తూ.. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ క్షమాపణ చెప్పాలని వరుపుల రాజా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: