ETV Bharat / state

కార్మిక సంక్షేమ బోర్డులో నమోదుతో అనేక ప్రయోజనాలు - కార్మిక సంక్షేమ బోర్డు వార్తలు

ఏ రోజు పని చేస్తే ఆరోజు గడిచే పరిస్థితి కార్మికులది. అనుకోని ఆపద ఎదురైతే కార్మికుడితో పాటు అతని కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా తయారయ్యే పరిస్థితి. అటువంటి సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. అవి పొందాలంటే బోర్డులో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. ఆ ప్రయోజనాలు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..

Many benefits
Many benefits
author img

By

Published : Jul 7, 2020, 12:11 PM IST

అందరూ అర్హులే..

అనుకోని ఆపద ఎదురైతే కార్మికుడుతో పాటు అతని కుటుంబ సభ్యులకు కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. వాటిని పొందేందుకు భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతర రంగాల కార్మికులు అర్హులే. రాళ్లు పగులగొట్టేవారు, వడ్రంగి, పెయింటర్స్‌, ప్లంబర్స్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, బావులు తవ్వేవారు, పూడిక తీసేవారు, వెల్డర్స్‌, బంటా మేస్త్రి, రహదారులు, కాలువల్లో మందు పిచికారీ చేసేవారు, చిప్స్‌ ప్యాకింగ్‌ చేసేవారు, సమ్మెట పనివారు, కాంక్రీట్‌ మిక్సింగ్‌ చేసేవారు, మిక్సర్‌ డ్రైవర్‌, పంపు ఆపరేటర్‌, రోలర్‌ డ్రైవర్‌, కళాసీ, వాచ్‌మెన్‌, మొజాయిక్‌, రాతి క్వారీ పనివారు, రోడ్డు నిర్మాణ కార్మికులు, సున్నం పనివారు, ఉపాధి హామీ కూలీలు, సీలింగ్‌ పనివారు, ఇటుకబట్టీ, క్వారీ, స్టోన్‌ క్రషింగ్‌, పనిచేసే కార్మికులంతా అర్హులే.

దరఖాస్తు ఎలా చేయాలంటే..

కార్మికులు సభ్యత్వం పొందాలంటే దరఖాస్తు పత్రం, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు నకళ్ల కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రాబ్యాంకులో రూ.110 చలానా తీయాలి. ఒకసారి నమోదు చేసుకున్న కార్మికుడి గుర్తింపు అయిదేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. తరువాత రూ.60 చెల్లించి నవీకరణ చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకోవాలి

అన్ని సహాయ కార్మిక కార్యాలయాల్లో సభ్యత్వ నమోదుకు అవకాశం ఉంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వల్ల కార్మికుడికి ఆర్థిక భరోసా ఏర్పడుతుంది. -పోలిశెట్టి శ్రీనివాస్‌, కార్మిక శాఖ ఉప కమిషనర్‌, కాకినాడ

ప్రయోజనాలు ఇవీ..

  • కార్మికుడు సహజ మరణం పొందితే అతడి కుటుంబ సభ్యులకు కార్మిక బోర్డు ద్వారా రూ.60 వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, మట్టి ఖర్చులకు రూ.20 వేలు అందుతుంది.
  • కార్మికుడికి ప్రమాదవశాత్తు సంభవించిన అంగవైకల్యానికి రూ.5 లక్షల వరకు సాయం చేస్తారు.
  • విధినిర్వహణలో ప్రమాదం జరిగి గాయపడినపుడు నెలకు రూ.3వేల చొప్పున మూడు నెలల పాటు అందిస్తారు.
  • కార్మికుడి కుమార్తెకు (ఇద్దరు కుమార్తెల వరకు), మహిళా కార్మికురాలి వివాహ ఖర్చులకు రూ.20 వేలు అందజేస్తారు.
  • ప్రసూతి పథకం కింద కార్మికుడి కుమార్తెకు (ఇద్దరు కుమార్తెల వరకు), భార్యకు రెండు కాన్పుల వరకు కాన్పుకు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు.
  • పేరు నమోదు కాని కార్మికుడు పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే అతడి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు, 50 శాతం కంటే తక్కువ అంగ వైకల్యం పొందితే రూ.10 వేలు, 50 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం పొందితే రూ.20 వేల వరకు అందజేస్తారు.

ఇదీ చదవండి: కరోనా టెస్ట్ చేయకుండానే.. పాజిటివ్, నెగిటివ్ మెసేజ్​లు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.