తూర్పు గోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన గంధం వరప్రసాద్.. రోజు కూలీగా పని చేస్తూ జీవించేవాడు. లాక్డౌన్ కారణంగా 45 రోజులుగా ఎలాంటి పనులు లేక మనస్థాపానికి గురైనట్టు కుటుంబీకులు చెప్పారు.
వరిచేలకు వేసే గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని... గమనించిన వెంటే ఆసుపత్రికి తరలించినా కాపాడుకోలేకపోయామని ఆవేదన చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై బుజ్జి బాబు తెలిపారు.
ఇవీ చూడండి: