తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని విద్యుత్ స్తంభంపై ముగ్గురు ప్రైవేటు కార్మికులు పని చేస్తుండగా...ఒక్కసారిగా కరెంట్ రావటంతో నాగేంద్ర(22)అనే యువకుడు షాక్కు గురయ్యాడు. మిగతా ఇద్దరూ పై నుంచి దూకడంతో గాయాలతో బయటపడ్డారు. లైన్మెన్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆరోపించారు. ముమ్మిడివరం జాతీయ రహదారిపై ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు...బంధువులతో చర్చలు జరిపారు.
ఇదీ చదవండి