కాకినాడ జగన్నాథపురంలో ఉప్పుటేరు కాలువలోకి దూకి.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పరదేసమ్మపేటకు చెందిన కసిరెడ్డి రవిగా.. అతడిని గుర్తించారు. కుటుంబ సమస్యలే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. ఘటన జరిగిన సమయంలో.. సమీపంలోనే ఉన్న జాలర్లు రవిని కాపాడారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో చికిత్స చేయించి అతణ్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇదీ చదవండి: