మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చిత్రకారులు ఆయనకు వినూత్న రీతిలో నివాళి అర్పిస్తున్నారు. గుంటూరు జిల్లా పెదరావూరుకు చెందిన ఉపాధ్యాయుడు వెంకటకృష్ణ గాంధీ చిత్తరువుని ఆకుపై చిత్రించారు. కదంబం చెట్టు నుంచి ఆకు సేకరించి, దానిపై బాపు చిత్రాన్ని రూపొందించారు.
![బియ్యపు గింజలతో బాపూ చిత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9016660_g3.jpg)
తూర్పుగోదావరి జిల్లా రంగపేటకు చెందిన సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ సబ్బుపైన మహాత్ముని ఆకృతిని తీర్చిదిద్దారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి కళాకృతిని రూపొందించారు. పి.గన్నవరానికి చెందిన పేరిచర్ల సత్యవాణి అనే గృహిణి బియ్యపు గింజలతో బాపూ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
![ఆకుపై గాంధీ చిత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9016660_g2.jpeg)
![సబ్బుతో మహాత్ముని ఆకృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9016660_g4-2.jpg)
ఇదీ చదవండి : ఐసీసీ ట్విట్టర్ పేజీలో.. ఆంధ్రా చిన్నారుల ఆట!