'తునిలో ఈ నెల 28 వరకు లాక్డౌన్' - తుని లాక్డౌన్ వార్తలు
తూర్పు గోదావరి జిల్లా తునిలో లాక్డౌన్ నిబంధనలు కొనగసాగుతాయని పురపాలక కమిషనర్ ప్రసాద రాజు వెల్లడించారు. కరోనా సోకిన బాధితుల్లో ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు.
తునిలో లాక్డౌన్
తూర్పు గోదావరి జిల్లా తునిలో రెడ్, కంటైన్మెంట్ జోన్లలలో ఈ నెల 28 వరకు లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని... పురపాలక కమిషనర్ ప్రసాద రాజు వెల్లడించారు.
ఈ నెల 1వ తేదీన పట్టణంలో ముగ్గురికి కరోనా సోకినప్పటి నుంచి అమల్లో ఉన్న లాక్ డౌన్.. నిబంధనల ప్రకారం ఈ నెల 28 వరకు కొనసాగుతుందని చెప్పారు.
ముగ్గురు బాధితుల్లో ఒకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు. తుని రెడ్ జోన్ ప్రాంతంలో 1,707 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు.