పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబానికి న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ముస్లిం సంఘాల నేతలు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఘటనకు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ.. స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌కు, స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించారు.
ఇదీ చదవండి: