ETV Bharat / state

లంకమట్టి తవ్వకాలపై గ్రామస్థుల ఆందోళన.. ఎస్ఐ, రైతుల మధ్య వాగ్వాదం - Conflict between SI and farmers in lanka villages news update

మానేపల్లిలో దళిత రైతులకు చెందిన లంక భూముల్లో మట్టి తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, దళిత రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు పెరుగులంక గ్రామస్థులు.. తమ గ్రామంలో మట్టి తవ్వకాలు ఆపాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

lanka Villagers worried about Soil excavations
లంకమట్టి తవ్వకాలపై గ్రామస్థులు ఆందోళన
author img

By

Published : Mar 28, 2021, 2:02 PM IST

లంకమట్టి తవ్వకాలపై గ్రామస్థులు ఆందోళన

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలో దళిత రైతులకు చెందిన లంక భూముల్లో మట్టి తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, దళిత రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ భూముల్లో మట్టిని తీసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతులు అన్నాయని.. అడ్డుకోవటం చట్ట రిత్యా నేరమని ఎస్​ఐ రైతులకు తెలిపారు. దళితుల భూముల్లో మట్టిని తరలించడం అన్యాయమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

44 ఏళ్ల క్రితమే ప్రభుత్వం తమకు లంక భూమిని పట్టాలపై ఇచ్చిందని.. ఆ భూమిని ఆనుకొని ఉన్న పెరుగులంకలో మట్టి తవ్వకాలు చేపడితే.. తామంత నష్టపోతామని ఆవేదన చెందారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఇక్కడ మట్టి తవ్వకాలు తాము అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేశారు. దీనిని ఆధారంగా చేసుకొని 200 రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని బాధితలు ఎస్​ఐకు వివరించారు.

కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామస్థులు ఆందోళన..

ప్రాణాలైన ఇస్తాం.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని పెరుగులంక గ్రామస్థులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులు కల్పించుకొని.. మట్టి తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల్లో మట్టి తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని.. దీనిపై ఉద్యమం చేసేందుకు సిద్ధమని బాధిత రైతులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

రాజమహేంద్రవరంలో హీరో నాని సందడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.