తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం చాకలిపాలెం సమీపంలోని కాజ్ వే,ఇంకా వరద నీటి ముంపులోనే ఉంది. 20 రోజులు గడుస్తున్న కాజ్ వే పై ఇప్పటికీ నీరు ప్రవహిస్తుండటంతో కాజ్ వే కు అవతల ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పిల్లలు, పెద్దలు, గర్భిణీలు వరద నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల, ఆసుపత్రులకు వెళ్లేందుకు తామకు చాలా కష్టంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: