కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతోంది. నిబంధనలను అతిక్రమించి రహదారులపైకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. దుకాణాలు అన్ని మూతపడ్డాయి. పాల డైరీలు సైతం తెరుచుకోలేదు.
సోమవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుంది. దీనికి ప్రజలు సహకరించాలని అధికారులు, పోలీసులు విజ్ఞప్తి చేశారు. అమలాపురం డీఎస్పీ షేక్. మాసూం బాష పర్యవేక్షణలో పోలీసులు కోనసీమ వ్యాప్తంగా కర్ఫ్యూను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు.
ఇదీ చూడండి