ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో వైకాపా కార్యాలయంలో మాట్లాడిన జగ్గిరెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతుంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు.
తెదేపా నేతలు రాజకీయాల కోసం ఎన్నికల కమిషన్ చేత తప్పుడు పనులు చేయిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు చూడలేకే.. ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని ఆరోపించారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలి తప్పా.. ఎవరో చెప్పినట్టు చేయడం కాదని అన్నారు.
ఇదీ చదవండి: