కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనాలను దేవాదాయ శాఖ అధికారులు ప్రారంభించారు. లాక్డౌన్ సడలింపులలో భాగంగా ప్రయోగాత్మకంగా స్థానికులు, సిబ్బందికి మాత్రమే దర్శనాలు కల్పించారు. ఈనెల 11 నుంచి ఇతర ప్రాంతాల భక్తులకు అనుమతి కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలోని ద్రాక్షరామం పంచారామ క్షేత్రమైన శ్రీ మాణిక్యంబ భీమేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనాలు ప్రారంభించారు. స్వామివారికి పూజలు నిర్వహించి మొదట విడతగా సిబ్బందికి దర్శనం కల్పించారు. తర్వాత పరిసర గ్రామల భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు ఆలయ అధికార్లు తెలియజేశారు.
లాక్డౌన్ అనంతరం అనుమతులు రావటంతో కోనసీమలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాలు తెరుచుకున్నాయి.