కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువుకు చెందిన పెంటపల్లి త్రిమూర్తులు నాలుగేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు.
మంగళవారం ఉదయం డయాలసిస్ చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చారు. అయితే జ్వరం, ఆయాసం ఉండటంతో డయాలసిస్ కంటే ముందు అత్యవసర విభాగానికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని వైద్యులు సూచించారు. వెంటనే కొవిడ్ విభాగానికి తీసుకెళ్లారు. అప్పటికే త్రిమూర్తులు చనిపోయినట్లు ఆర్ఎంవో ఆనంద్ ధ్రువీకరించారు. కళ్లెదుటే ప్రాణాలు పోవటంతో అతని భార్య, కుమారులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇవీ చదవండి..