ETV Bharat / state

ఖరీఫ్‌ సాగుకు సమాయత్త సదస్సులు - Kharif Cultivation Conferences in East Godavari District

తూర్పుగోదావరి జిల్లాలో రబీ అనంతరం మూడో పంటగా అపరాలు సాగుచేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు నందిగం విజయకుమార్‌ పేర్కొన్నారు. ఇందుకోసం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే ప్రణాళిక అవసరమన్నారు.

Vijaykumar
Vijaykumar
author img

By

Published : May 15, 2021, 11:18 AM IST

జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం… తూర్పుగోదావరి జిల్లాలో రైతులను సమాయత్తం చేసేందుకు సదస్సులు ఏర్పాటు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నందిగం విజయకుమార్‌ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలవారీగా రైతులతో 15రోజులుపాటు సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. జూన్‌ మొదటి వారానికి ఈ సదస్సులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

రబీ అనంతరం మూడో పంటగా అపరాలు సాగుచేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా రైతులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ఐదున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ సాగు చేస్తారని విజయకుమార్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

రైతుకు మంట.. వ్యాపారికి ‘పంట’..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.