కాకినాడలో జూన్ 7న జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపిన వివరాల ప్రకారం...సూర్యారావుపేటలోని భార్యాభర్తలను హత్య చేసిన నిందితుడు వీర్రాజు గతంలో రెండేళ్ల పాటు అదే ఇంట్లో అద్దెకు ఉన్నాడని... స్టాక్ మార్కెట్లో నష్టాలు రావటంతో చోరీకి వెళ్లి ఈ హత్యలు చేశాడన్నారు. ఆధారాలు లభించకుండా ఉండేందుకు పలు డాక్యుమెంట్లు తగులబెట్టాడని చెప్పారు. నిందితుడు చేసిన మూడు సెకండ్ల కాల్ ఆధారంగా కేసును ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు. అతని దగ్గరనుంచి 4 లక్షల 75వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి