తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని పనులు లేక అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలకు కడలి బ్రదర్స్ సేవా సమితి సభ్యులు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అన్నార్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులు గమనించి.. సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో పేదవారికి తాము ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీచదవండి.