పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జ్యూయలరీ దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్ర జ్యుయలరీ దుకాణానికి నగలు కొనేవారి మాదిరిగా వచ్చిన ఇద్దరు మహిళలకు, యజమాని నగలు చూపిస్తుండగా రెండు కాసుల బరువైన చెవి దుద్దులను అపహరించారు. అనుమానంతో దుకాణ యజమాని సిసి టీవీ ఫుటేజి పరిశీలించి, వారిద్దరూ దొంగతనం చేసినట్టు గుర్తించి పోలీసులకు అప్పగించారు. విజయవాడకు చెందిన పాత నేరస్తులుగా వీరిని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరిపై కృష్ణా జిల్లాలో 22 కేసులు ఉన్నాయని, రౌడీ షీట్లనూ తెరిచారని పోలీసులు తెలిపారు. మహిళా దొంగలకు తణుకు కోర్టు రిమాండ్ విధించింది.
ఇదీ చూడండి:మీ ఇంట్లో కుక్క ఉందా?... తస్మాత్ జాగ్రత్త!