తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. రావులపాలెంలో ఎంతో రద్దీగా ఉండే 16వ నెంబరు జాతీయ రహదారి వాహనాల తాకిడి లేక వెలవెలబోయింది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కావడంతో బస్టాండ్ ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూ.. రాజమహేంద్రవరంలో రహదారులు వెలవెల