ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు జనసేన సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావ వేదికలుగా మొదటి నుంచి తన వైఖరి సుస్పష్టం చేస్తోన్నజనసేనాని.. రాజమహేంద్రవరంలో నేడు నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ సభా వేదికగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. 32 మంది శాసన సభ, నలుగురుపార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసిన జనసేనాని, ఇవాళ సభలో మేనిఫెస్టోను ప్రకటించే అవకాశముంది.
ప్రజాకర్షక పథకాలతో జనంలోకివెళ్లేందుకుమేనిఫెస్టో రూపకల్పనకు జనసేనాని తుదిమెరుగులు దిద్దుతున్నారు. గత ఆగస్టులో జనసేన మ్యానిఫెస్టో పేరుతో....ఏయే అంశాలను స్పృశించబోయేదీ వివరిస్తూ ఆ పార్టీ ఒక నోట్ విడుదల చేసింది. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రేషన్ బదులు నగదు బదిలీ వంటి అంశాలు అందులో ఉన్నాయి. జనసేన పార్టీ ప్రధానంగా రైతులు, మహిళలు, యువతే లక్ష్యంగా ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికకు ఓ రూపాన్ని ఇస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
2014లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ మైదానంలో జనసేన ఆవిర్భావం జరిగింది. ఆ ఏడాది వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ,అప్పటి మిత్రపక్షాలైన తెదేపా, భాజపాకు జనసేన మద్దతిచ్చింది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2017 నుంచి మళ్లీ క్రియాశీలక రాజకీయాలపై దృష్టి సారించారు.
గతేడాది మంగళగిరి వేదికగా జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేశారు . అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజాసమస్యలపై దృష్టి సారించారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న జనసేనాని...తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. వామపక్షాలు మినహా మరే ఇతర పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు.
ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది జనసేన కార్యకర్తలు హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన క్యాడర్‌కు కూడా ఈ సభావేదికగా పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
నేడే జనసేన మేనిఫెస్టో..! - undefined
రాజమహేంద్రవరం వేదికగా నేడు నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ సభా వేదికగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే అవకాశముంది. 32 మంది శాసన సభ, నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను జనసేనాని ఎంపిక చేశారు.
ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు జనసేన సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావ వేదికలుగా మొదటి నుంచి తన వైఖరి సుస్పష్టం చేస్తోన్నజనసేనాని.. రాజమహేంద్రవరంలో నేడు నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ సభా వేదికగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. 32 మంది శాసన సభ, నలుగురుపార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేసిన జనసేనాని, ఇవాళ సభలో మేనిఫెస్టోను ప్రకటించే అవకాశముంది.
ప్రజాకర్షక పథకాలతో జనంలోకివెళ్లేందుకుమేనిఫెస్టో రూపకల్పనకు జనసేనాని తుదిమెరుగులు దిద్దుతున్నారు. గత ఆగస్టులో జనసేన మ్యానిఫెస్టో పేరుతో....ఏయే అంశాలను స్పృశించబోయేదీ వివరిస్తూ ఆ పార్టీ ఒక నోట్ విడుదల చేసింది. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రేషన్ బదులు నగదు బదిలీ వంటి అంశాలు అందులో ఉన్నాయి. జనసేన పార్టీ ప్రధానంగా రైతులు, మహిళలు, యువతే లక్ష్యంగా ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికకు ఓ రూపాన్ని ఇస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
2014లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ మైదానంలో జనసేన ఆవిర్భావం జరిగింది. ఆ ఏడాది వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ,అప్పటి మిత్రపక్షాలైన తెదేపా, భాజపాకు జనసేన మద్దతిచ్చింది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2017 నుంచి మళ్లీ క్రియాశీలక రాజకీయాలపై దృష్టి సారించారు.
గతేడాది మంగళగిరి వేదికగా జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేశారు . అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజాసమస్యలపై దృష్టి సారించారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న జనసేనాని...తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. వామపక్షాలు మినహా మరే ఇతర పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు.
ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది జనసేన కార్యకర్తలు హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన క్యాడర్‌కు కూడా ఈ సభావేదికగా పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
TAGGED:
జనసేన మేనిఫెస్టో