జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతుకు ఎకరానికి 8 వేల సాయం చేస్తామన్నారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన జనసేనఆవిర్భావ సభలో.. ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు.60 ఏళ్లుపై బడిన సన్న , చిన్న కారు రైతులకు 5 వేల పింఛను ఇస్తామన్నారు.
కేజీ నుంచి పీజీ దాకా అందరికీ ఉచిత విద్యను అందిస్తామని... విద్యార్థులకు గుర్తింపు కార్డుపై ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఆరేళ్లలో లక్ష ఉద్యోగాలు, ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పనే జనసేన లక్ష్యమని తెలిపారు. డొక్కా సీతమ్మ పేరుతోక్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉచితంగా భోజనం అందిస్తామని చెప్పారు.