ETV Bharat / state

మహిళా సర్పంచ్ ఫిర్యాదు చేసినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు : నాదెండ్ల - ap latest news

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో.. సర్పంచ్ మీనా కుమారిపై వైకాపా నాయకులు అనుచితంగా వ్యవహరించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఈ విషయంలో సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

janasena leader nadendla manohar fires on ycp followers and police
పోలీసులపై నాదెండ్ల ఫైర్
author img

By

Published : Jan 9, 2022, 4:01 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో.. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి సర్పంచ్ గా ఎన్నికైన.. మీనా కుమారి విషయంలో వైకాపా నాయకులు అనుచితంగా ప్రవర్తించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అయితే.. పోలీసులు వైకాపా నాయకులపై కేసులు నమోదు చేయకుండా మౌనంగా ఉండటం దారుణమని దుయ్యబట్టారు.

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులు.. తనకు గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించారని సర్పంచ్ మీనా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని నిలదీశారు. గ్రామ సర్పంచ్ కి దక్కాల్సిన ప్రొటోకాల్ కూడా ఇవ్వకుండా.. అవమానించిన వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు వెనకాడుతున్నారని, ఇందుకు అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని ఆరోపించారు.

మీనా కుమారికి అండగా నిలిచిన.. మండపేట నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, ఇతర జనసేన నాయకులపై.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. ఈ కేసు వివరాలను ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

ఇదీ చదవండి:

FAMILY SUICIDEనిజామాబాద్‌ వాసుల ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.