ఈ నెల 12 న కాకినాడలో దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్ రైతులకు గిట్టుబాటు ధరలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈనెల 12న నిరసన దీక్ష చేపట్టనున్నారు. జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పవన్ ఒకరోజు నిరసన దీక్ష చేయనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. వైకాపా ప్రభుత్వం రైతు సమస్యలపై స్పందించడం లేదని పార్టీ నాయకుడు పంతం నానాజీ విమర్శించారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు మాత్రం నామమాత్రంగా ఉంటున్నాయని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి:
ఉల్లి' దొంగతనాలే దేశంలో నయా ట్రెండ్!