తెలుగుదేశం హయాంలో కాపులకు అన్యాయం జరిగినపుడు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ.. ఐదేళ్లలో రూ. 5వేల కోట్లకు రూ. 1600 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే చంద్రబాబునాయుడిని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.
పాదయాత్రలో కాపులకు ఇచ్చిన ఏడాదికి రూ. 2వేల కోట్ల హామీని సీఎం జగన్ తొలి ఏడాదిలోనే నెరవేర్చారని చెప్పారు. కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ పవన్ ఓడిపోయారని.. రాజకీయాలు మానేసి మళ్లీ సినిమాలు చేసుకుంటే బావుంటుందని సూచించారు.
ఇవీ చదవండి..