తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించేందుకు ఆయన మారేడుమిల్లి మండలంలో పర్యటించారు.
ఏజెన్సీలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో.. సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులను వేగవంతం చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
ఇదీ చదవండి: అక్రమార్కుల ధన దాహానికి.. అమాయకుడు బలి