తూర్పుగోదావరి జిల్లాలో 14 కోట్ల 30 లక్షల రూపాయలతో పంట కాలువలు, మురుగుకాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులను చేపట్టనున్నారు. ఈ పనులను 9 ప్యాకేజీలుగా విభజించినట్లు జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ తెలిపారు. ఈ నెల 18న టెండర్లు పిలిచినట్లు ఆయన వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ నుంచి రబీ సీజన్ వరకు ఈ పనులు కొనసాగుతాయని రామకృష్ణ తెలిపారు. పంటకాలువలు, మురుగు కాలువల ప్రవాహానికి ఆటంకం లేకుండా గుర్రపు డెక్క ఇతర అనవసర మెుక్కలు తొలగించి శుభ్రం చేయనున్నారు.
ఇదీ చదవండి: Gang Rape: ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి..యువతిపై సామూహిక అత్యాచారం!