తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జలవనరుల శాఖ అధికారులు గోదావరి వరద ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదికి వరద అంచనా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితరాలకు సంబంధించి పటిష్ఠ చర్యలపై సమావేశంలో చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో వరద ముంపుపైనా సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కలెక్టర్ మురళీధర్ రెడ్డికి సమర్పించనున్నారు. అనంతరం ఆయన సమక్షంలో మరోసారి భేటీ కానున్నారు.
ఇవీ చదవండి.. యువకుల ఔదార్యం... 50 రోజులుగా అభాగ్యులకు ఆహారం