రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదని.. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని తెదేపా జాతీయ ప్రాధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం.. చెత్తపై పన్ను వేసి ప్రజలపై ఇంకా భారం మోపుతోందని లోకేశ్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మఠం సెంటర్‌లో నిర్వహించిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్.. స్థానిక పార్టీ నేతలతో కలిసి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.
కొందరు అధికారులు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారన్న లోకేశ్.. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో కలిపి బదులిస్తామని హెచ్చరించారు.
ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారి నియామకం